ఉపాధి హామీ ఉద్యోగుల పెన్ డౌన్
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
పెద్దపల్లి,ఆంధ్రప్రభ: పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు శుక్రవారం పెన్‌డౌన్, షట్‌డౌన్ నిరసన చేపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తమకు తగిన పే స్కేల్, గుర్తింపు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు శాంతియుతంగా పెన్‌డౌన్, షట్‌డౌన్ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రమేశ్‌బాబు, జేఈ రాజయ్య, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు తొడుపునూరు సుజాత, దివ్య, సురేన్ తదితరులు పాల్గొన్నారు.
