అయ్యప్ప భక్తులకు పల్నాడు ఆర్టీసీ శుభవార్త..
- శబరిమలకు ప్రత్యేక ప్యాకేజీ బస్సులు
పల్నాడు, ఆంధ్రప్రభ : శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం పల్నాడు జిల్లా ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులను బుక్ చేసుకునే ముందు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను కూడా పరిశీలించాలని అధికారులు సూచించారు.
45 రోజులకు పైగా కఠోర దీక్ష ఆచరించి శబరిమల యాత్ర చేసే భక్తుల సౌకర్యార్థం పల్నాడు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఒకే గ్రూపులో 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది భక్తులు ఉంటే, వారు కోరుకున్న గ్రామం లేదా ప్రదేశానికే ఆర్టీసీ ప్రత్యేక బస్సును పంపించే సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచే శబరిమల యాత్రను ప్రారంభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మరింత సమాచారం కోసం సమీపంలోని ఆర్టీసీ డిపోను సంప్రదించవచ్చని, లేదా ఈ క్రింది నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
చిలకలూరిపేట డిపో: 9959225427
నరసరావుపేట డిపో: 9959225428
పిడుగురాళ్ల డిపో: 9959225430
మాచర్ల డిపో: 9959225432
వినుకొండ డిపో: 9959225431
సత్తెనపల్లి డిపో: 9959225429
శబరిమల యాత్రను సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగించేందుకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ సేవలను అయ్యప్ప స్వామి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
గమనిక : అయ్యప్ప స్వామి భక్తుల కోరిక మేరకు అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయబడతాయి. ఒకే గ్రూప్లో 30 మంది భక్తులు ఉంటే, వారు కోరుకున్న ఊరికి లేదా ప్రదేశానికి ఆర్టీసీ బస్సు వస్తుంది. అక్కడి నుండే మీ శబరిమల యాత్రను ప్రారంభించవచ్చు.
