OTT Release | ఈ వారం 30కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: వీకెండ్‌ వచ్చేసింది. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం థియేటర్లలో ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’, ‘శ్రీనివాస మంగాపురం’ వంటి చిత్రాలు విడుదలై సందడి చేస్తున్నాయి.

ఇక ఓటీటీ ప్రియులకు మాత్రం ఈ వారం నిజంగానే పండగ వాతావరణం నెలకొంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూసే ప్రేక్షకులకు ఈసారి కూడా విభిన్న భాషల్లో ఎన్నో కొత్త విడుదలలు అందుబాటులోకి వస్తున్నాయి.

థియేటర్లకు వెళ్లే అవకాశం లేకపోయినా, ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి వినోదాన్ని ఆస్వాదించేందుకు చాలామంది ఓటీటీ వేదికలనే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, ఈటీవీ విన్, జియోహాట్‌స్టార్, జీ5, సన్‌ఎన్‌ఎక్స్‌టీ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు ఇంగ్లీష్‌ భాషల్లోనూ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరమైన విడుదలలు

ఈ వారం తెలుగు ప్రేక్షకుల కోసం విభిన్న కథలతో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.
‘ఆజాదీ 501’ ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా, కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ‘సెకండ్ మ్యారేజ్’ ఈటీవీ విన్‌లో విడుదల కానుంది.
అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ‘రావు బహదూర్’ చిత్రం తెలుగు సహా పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఆహాలో ‘దీవానా’ సినిమా విడుదల అవుతోంది.
న్యాయ నేపథ్యంతో రూపొందిన ‘ఆబ్జెక్షన్ మై లార్డ్’ వెబ్ సిరీస్ జీ5లో, ‘హరిచంద్ర కథ’ వెబ్ సిరీస్ ఆహాలో ప్రేక్షకులను అలరించనున్నాయి.

తమిళం, మలయాళం, కన్నడలో కొత్త కథలు.. తెలుగులోనూ..

తమిళ ప్రేక్షకుల కోసం ‘గట్ట కుస్తీ 2’, ‘లవ్ ఓ లవ్’ సినిమాలతో పాటు ‘హార్ట్ బీట్ – సీజన్ 3’ వెబ్ సిరీస్ విడుదల కానుంది.
మలయాళంలో ‘చిన్న చిన్న ఆశై’, ‘బాలన్ ది బాయ్’, ‘పైతలట్టం’ సినిమాలు ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కన్నడలో ‘భువనం గగనం’ సినిమా జీ5లో విడుదల కానుంది.

హిందీలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

హాలీవుడ్ అభిమానులకు భారీ లైనప్…

సూపర్‌గర్ల్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) – ప్రైమ్ వీడియో (రెంట్), ఆపిల్ టీవీ
ఘోస్ట్ ట్రైన్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) – ప్రైమ్ వీడియో
ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ (ఇంగ్లీష్) – ప్రైమ్ వీడియో (రెంట్)
డ్యూ వెస్ట్ (ఇంగ్లీష్) – ప్రైమ్ వీడియో (రెంట్)
ది జెంటిల్‌మన్ థీఫ్ (ఇంగ్లీష్) – ప్రైమ్ వీడియో (రెంట్)
లెవిటికస్ (ఇంగ్లీష్) – ప్రైమ్ వీడియో (రెంట్)
ది డెవిల్స్ మౌత్ (ఇంగ్లీష్) – ప్రైమ్ వీడియో
ది ఐడాహో మర్డర్స్: కాలేజ్ నైట్‌మేర్ – సీజన్ 1 (ఇంగ్లీష్ ఒరిజినల్, తమిళం, తెలుగు, హిందీ) వెబ్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్
ది డెవిల్ వేర్స్ ప్రాడా 2 (ఇంగ్లీష్) – జియోహాట్‌స్టార్
ఏ ప్రైవేట్ లైఫ్ (ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్
ది బాంబింగ్ ఆఫ్ పాన్ యామ్ 103 (ఇంగ్లీష్, హిందీ) వెబ్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్
చమ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) – లయన్స్‌గేట్ ప్లే
బ్యాట్‌మ్యాన్: కేప్డ్ క్రూసేడర్ – సీజన్ 3 (ఇంగ్లీష్) వెబ్ సిరీస్ – ప్రైమ్ వీడియో
ది డ్రామా (ఇంగ్లీష్) – హెచ్‌బీఓ మ్యాక్స్
మ్యాడీస్ సీక్రెట్ (ఇంగ్లీష్) – ప్రైమ్ వీడియో (రెంట్)
నైట్‌బోర్న్ (ఇంగ్లీష్) – షడర్
ఓవర్ యువర్ డెడ్ బాడీ (ఇంగ్లీష్) – ఏఎంసీ+
చికాగో పీడీ (ఇంగ్లీష్) వెబ్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్
డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్ పార్ట్ 1 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) – ప్రైమ్ వీడియో
సన్ ఆఫ్ సారా – సీజన్ 1 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) వెబ్ సిరీస్ – ప్రైమ్ వీడియో

ఈ వారం ఇతర భాషల్లో కూడా ఆసక్తికరమైన చిత్రాలు

ఫైనల్ ప్రాజెక్ట్ (స్పానిష్ ఒరిజినల్, ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్
వైల్డ్ సింగ్ (కొరియన్, ఇంగ్లీష్, హిందీ) – నెట్‌ఫ్లిక్స్
షేక్, రాటిల్ అండ్ రోల్: ఈవిల్ ఆరిజిన్స్ (ఫిలిప్పీనో) – నెట్‌ఫ్లిక్స్
ఆఓఆషి (జపనీస్) వెబ్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్
మికాయెల్: పెంబురు దువా ఆలమ్ (మలేషియన్) – నెట్‌ఫ్లిక్స్ ‘ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ వారం చూడదగ్గ ఓటీటీ విడుదలలు…

ఆజాదీ 501 – ఆహా
సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్
రావు బహదూర్ – నెట్‌ఫ్లిక్స్
దీవానా – ఆహా
ఆబ్జెక్షన్ మై లార్డ్ (వెబ్ సిరీస్) – జీ5
హరిచంద్ర కథ (వెబ్ సిరీస్) – ఆహా
గట్ట కుస్తీ 2 – నెట్‌ఫ్లిక్స్
లవ్ ఓ లవ్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
హార్ట్ బీట్ – సీజన్ 3 – జియోహాట్‌స్టార్

ఈ వారాంతంలో యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా లేదా వెబ్ సిరీస్ ఏది చూడాలన్నా ఓటీటీల్లో మీ కోసం ఎన్నో కొత్త ఎంపికలు సిద్ధంగా ఉన్నాయి. మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని ఈ వీకెండ్‌ను మరింత వినోదంగా మార్చుకోండి.