రావిపాడులో చికెన్ వ్యర్థాల ఆటో స్వాధీనం..
మత్స్యశాఖ తీరుపై ఆరోపణలు
నరసరావుపేట, (ఆంధ్రప్రభ) : రావిపాడు గ్రామంలో అనుమతులు లేకుండా కోళ్ల మాంసం వ్యర్థాలను తరలిస్తున్న ఆటోను గ్రామ పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు స్వాధీనం చేసుకున్నారు. కోళ్ల వ్యర్థాలను సేకరించి పమిడిపాడు చెరువులో చేపలకు ఆహారంగా వేస్తున్నట్లు గుర్తించి, ఆటో డ్రైవర్ సాయి, యజమాని వెంకటేశ్వర్లును తీవ్రంగా మందలించారు. కోళ్ల మాంసం వ్యర్థాలను ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు
మత్స్యశాఖ తీరుపై ఆరోపణలుఈ ఘటనపై గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శి మత్స్యశాఖ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ, సిబ్బందిని పంపుతున్నామని చెప్పి ఆలస్యం చేశారని ఆరోపించారు. చెరువుల్లో చేపలకు కోళ్ల మాంసం వ్యర్థాలను వేస్తున్నా, మత్స్యశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు
కొంతమంది చెరువు యజమానులు, కోళ్ల మాంసం వ్యర్థాల సరఫరాదారుల నుంచి మత్స్యశాఖ సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
