పెదమక్కెనలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం..
పెదమక్కెనలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం..
సత్తెనపల్లి టౌన్, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి మండలంలోని పెద మక్కెన గ్రామం నందు 36 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం రైతులకు 50% సబ్సిడీ పై పచ్చి రొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని,గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు.ఐదేళ్లపాటు వైసీపీ విధ్వంసం పాలన కొనసాగిన తర్వాత మళ్లీ మన పల్లెలు అభివృద్ధి బాటపడుతున్నాయన్నారు.

జగన్ హయాంలో రాక్షస ,అరాచక పాలన సాగిందని,కూటమి ప్రభుత్వం లో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కోమటినేని శోభారాణి,మండల అధ్యక్షులు ఆళ్ల అమరేశ్వరరావు,నాయకులు మొక్కపాటి రామచంద్రరావు, కోమటినేని శ్రీనివాసరావు,వైద్య సిబ్బంది, అధికారులు,వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల ,గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
