కేసీఆర్ చిత్రపటానికి పూజలు చేసిన మహిళలు

గురు పౌర్ణమి సందర్భంగా హారతులు ఇచ్చి అభిమానాన్ని చాటుకున్న ముఖరా (కే) మహిళలు

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: గురు పౌర్ణమి సందర్భంగా ఇచ్చోడ మండలంలోని ముఖరా (కే) గ్రామ మహిళలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ గురువులను స్మరించుకుంటారని, తమకు ఆత్మబంధువుగా భావించే కేసీఆరే తమ గురువని పేర్కొన్నారు. మరోసారి ఆయన నాయకత్వం రావాలని ఆకాంక్షించారు.

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొంటూ ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షితో పాటు లక్ష్మి, పారుబాయి, అనుసబాయి, శారదా తదితర మహిళలు పాల్గొన్నారు.