ఇనుముల సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
గౌరమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
మంథని, ఆంధ్రప్రభ: మంథని పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది ఇనుముల సత్యనారాయణ కుటుంబాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు.
ఇనుముల సత్యనారాయణ తల్లి గౌరమ్మ ఇటీవల మరణించగా, మంత్రి శ్రీధర్ బాబు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇనుముల సత్యనారాయణతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
మంత్రి వెంట మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, ఆర్టీఏ సభ్యుడు సురేష్, నాయకులు మంథని సత్యం, ఆకుల కిరణ్, ఉప్పట్ల శ్రీనివాస్, బొబ్బిలి శ్రీధర్, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆరేళ్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
