సర్వమత సమైక్యతావాది కృష్ణారావు..
అవనిగడ్డ ముస్లిం సోదరుల నివాళి
ఘనంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : సర్వమత సమైక్యతావాదిగా మండలి వెంకట కృష్ణారావు సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేశారని ముస్లిం సోదరులు పేర్కొన్నారు. అవనిగడ్డ వంతెన సెంటరులో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, ఆర్త జన బంధువు, తెలుగు భాష అభివృద్ధి ప్రదాత, విద్యార్థి స్వతంత్ర ఉద్యమ పోరాట యోధుడు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం కృష్ణారావు విగ్రహానికి అవనిగడ్డ ముస్లిం నాయకులు, పెద్దలు మొగల్ మురాద్ బేగ్, షేక్ బాబావలి, మహమ్మద్ వాహేదుల్లా, మహమ్మద్ యూసుఫ్, మహమ్మద్ గౌస్ ఖాన్, అబ్దుల్ రెహమాన్, షేక్ కరీం, షేక్ ఖలీల్, షేక్ రహమతుల్లా తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీల ప్రతినిధులు, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, పీఏసీఎస్ చైర్మన్లు మాదివాడ రత్నారావు, యలవర్తి రాజ నాగ మునేశ్వరరావు (చిన్నా), యర్రంశెట్టి సుబ్బారావు, నీటి సంఘ అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, బచ్చు శ్రీహరి, సిద్ధినేని అశోక్ నాయుడు, డేగల రాఘవ, యాసం శ్రీరాములు, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య, రేపల్లె కృష్ణమూర్తి, గరికపాటి హరిబాబు, అన్నపరెడ్డి నాగ చెంచయ్య, కోసూరు పూర్ణచంద్రరావు, మండలి రామ్మోహనరావు, బొప్పన కాశీ విశ్వేశ్వరరావు, అడబాల వేణుగోపాలరావు, పులిగడ్డ బాలు శ్రీనివాస్, బడే సుబ్బారావు, చెన్ను శివాజీ, ముళ్లపూడి శ్రీనివాసరావు, మొగల్ మురాద్ బేగ్, భోగాది బాలకృష్ణ, సోమిరెడ్డి, నారేపాలెం శంకరరావు, సిద్ధాబత్తుని హరినాథబాబు, మాదివాడ రాము, మైలా హరిబాబు, కొండవీటి పాండురంగారావు, విశ్వనాధపల్లి పాప, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, పసి, వాహేదుల్లా, ఆకుల సీతామహాలక్ష్మి, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
