ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడిగా లక్ష్మణ్
నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక.. ఘనంగా సన్మానం
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ నేరేడుచర్ల హరివిల్లు శాఖ నూతన అధ్యక్షుడిగా కొత్తా లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్లబ్ ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి శ్రీధర్, కోశాధికారిగా పోలిశెట్టి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా హరివిల్లు క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ వీరవల్లి శ్రీలత, రీజియన్ సర్వీసెస్ ఇన్చార్జి సరికొప్పుల నాగేశ్వరరావు నూతన అధ్యక్షుడు కొత్తా లక్ష్మణ్, ఆయన సతీమణి పద్మను మంగళవారం ఘనంగా సన్మానించారు.
కొత్తా లక్ష్మణ్ గత రెండు సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రేరణాత్మక తరగతులు నిర్వహిస్తూ పలువురు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ అందించి చైతన్యపరిచారు. ఆయన గతంలో నేరేడుచర్ల వాసవి క్లబ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ విజయలక్ష్మి, పోలిశెట్టి వాసవి, పోలిశెట్టి శరణ్, మాధురి, ఈగా భాగ్యలక్ష్మి, కురువెళ్ల సంధ్య, శ్రీరామ్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
