కామన్వెల్త్‌లో నేడు పతకాల వేట..
- గెలిస్తే పతకం ఖాయం
ఆంధ్రప్రభ : కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత క్రీడాకారులు మంగళవారం (జూలై 28) మరోసారి పతకాల వేటకు సిద్ధమయ్యారు. వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఈత, బౌల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనుండగా.. మరిన్ని పతకాలు ఖాతాలో చేరే అవకాశాలపై అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 63 కిలోల విభాగంలో నిరూపమ దేవి, 69 కిలోల విభాగంలో 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ కాంస్య పతక విజేత హర్జిందర్ కౌర్ పోటీపడనున్నారు. మరోసారి పోడియంపై నిలవాలని ఇద్దరూ లక్ష్యంగా పెట్టుకున్నారు.
బాక్సింగ్‌లో మహిళల 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్, 60 కిలోల విభాగంలో ప్రియా ఘంఘాస్, 65 కిలోల విభాగంలో పర్వీన్ హూడా, పురుషుల 55 కిలోల విభాగంలో జదుమణి సింగ్, 90 కిలోల విభాగంలో కపిల్ పోఖరియా క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నారు. వీరు విజయం సాధిస్తే భారత్ కు… కాంస్య పతకం ఖాయం కానుంది.
అథ్లెటిక్స్‌లో మహిళల హైజంప్ ఫైనల్లో పూజా సింగ్ పతకంపై గురి పెట్టగా, పురుషుల 400 మీటర్ల హీట్స్‌లో రాజేష్ రమేష్, విశాల్ టీకే పోటీ పడనున్నారు. అలాగే రాత్రి జరిగే పురుషుల 10,000 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్ భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
ఈతలో సజన్ ప్రకాశ్ (50 మీటర్ల బటర్‌ఫ్లై), శ్రీహరి నటరాజ్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్) హీట్స్‌లో పోటీ పడనుండగా, పారా స్విమ్మింగ్‌లో కార్తీక్ బుడిగిన, అలీ ఇమామ్ ఎస్13 విభాగంలో హీట్స్‌లో బరిలోకి దిగనున్నారు. ఫైనల్‌కు అర్హత సాధిస్తే పతకం కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది.
బౌల్స్‌లో పురుషుల జంట విభాగంలో దినేష్ కుమార్–నవ్‌నీత్ సింగ్ జోడీ కుక్ దీవుల జట్టుతో తలపడనుండగా, మహిళల సింగిల్స్‌లో నయన్మోని సైకియా తన తదుపరి మ్యాచ్ ఆడనుంది.
జూలై 28న భారత షెడ్యూల్..
- మధ్యాహ్నం 3:26 – సజన్ ప్రకాశ్ (50 మీటర్ల బటర్‌ఫ్లై హీట్స్)
- 4:30 – విశాల్ టీకే, రాజేష్ రమేష్ (400 మీటర్ల హీట్స్)
- 4:41 – శ్రీహరి నటరాజ్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్)
- 6:30 – నిరూపమ దేవి (63 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్)
- 10:30 – ప్రీతి పవార్ (బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్)
- 11:00 – ప్రియా ఘంఘాస్ (బాక్సింగ్), హర్జిందర్ కౌర్ (69 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్)
- 11:35 – పూజా సింగ్ (హైజంప్ ఫైనల్)
- 12:15 – జదుమణి సింగ్ (బాక్సింగ్)
- 12:55 – గుల్వీర్ సింగ్ (10,000 మీటర్ల ఫైనల్)
- 1:30 – కపిల్ పోఖరియా (బాక్సింగ్)
