విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.. తెడ్లంలో విషాదం
ఏలూరు/టీ. నర్సాపురం, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలం తెడ్లం గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చవల అప్పారావు (43) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతుడు అప్పారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షాక్ ఎలా తగిలిందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
