AP| అప్పలరాజు కుమారుడి కేసులో కొత్త పరిణామం..

AP| పలాస, జులై 18(ఆంధ్రప్రభ): కాశీబుగ్గ సీఐగా పనిచేస్తున్న సిఐ వై.రామకృష్ణ, ఎస్సైగా పనిచేస్తున్న ఎం సునీల్ ను వేకెన్సీ రిజర్వ్ (వి ఆర్ ) కు పంపిస్తూ జిల్లా ఎస్పీ కే మహేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేయగా దుబ్బ దానయ్య అనే గొర్రెల కాపరి మృతిచెందిన సంఘటనకు సంబంధించి ఈ కేసులో నిందితులను తారుమారు చేయడం,

చివరకు సిసి ఫుటేజ్ ఆధారంగా అసలు నిందితుడుగా మాజీ మంత్రి అప్పలరాజు తనయుడు అరవ్ వర్మ గా పోలీసులు గుర్తించి, అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఈకేసులో ప్రధాన నిందితుని తెప్పించే ప్రయత్నాలు, దానిని పోలీసులు సకాలంలో గుర్తించకపోవడం, కొంత సహకారం అందించిన ఆరోపణలు మేరకు కాశీబుగ్గ సీఐ, ఎస్ఐలను వి ఆర్ కు పంపడం ప్రధాన కారణంగా స్థానికంగా చర్చ జరుగుతుంది.