RSP Praveen Kumar | పోలీసులు వెంబడిస్తున్నారన్న ఆరోపణ
హౌస్ అరెస్టు నుంచి బయటపడ్డానన్న ఆర్ఎస్పీ
వీడియో విడుదల చేసిన బీఆర్ఎస్ నేత
యువ సంగ్రామ సదస్సు విజయవంతమవుతుందన్న ధీమా
RSP Praveen Kumar | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరూర్నగర్లో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు బయలుదేరారు. హౌస్ అరెస్టు నుంచి బయటపడి సభకు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా తనను నార్సింగి పోలీసులు ఇంకా వెంబడిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
“పోలీసుల నిర్బంధపు వలయాన్ని దాటి సరూర్నగర్ సభకు వస్తున్నాను. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీడియోలో పేర్కొన్నారు. అయితే, పోలీసులు తనను ఎందుకు అడ్డుకున్నారనే అంశంపై అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై కూడా పోలీసుల స్పందన రావాల్సి ఉంది. ఈ పరిణామం బీఆర్ఎస్ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
