మాన్కుగూడలో గిరిజనుల అకాడిపూజలు

జైనూర్, (ఆంధ్రప్రభ) కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మాన్కుగూడ అటవీ పరిసర ప్రాంతాల్లో స్థానిక సర్పంచ్ కుమ్ర దేవుశావ్, ఆదివాసి గిరిజనులుఅకాడి పూజలు చేశారు. సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని, దేవుళ్లకు మొక్కుకున్నట్లు సర్పంచ్, కుమ్ర దేవుసావ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఆదివాసి గిరిజనులు పాల్గొన్నారు.