Shankarpally | బావిలోకి దూకిన తల్లి, ఇద్దరు చిన్నారులు
తల్లి, కుమార్తె మృతి.. ప్రాణాలతో బయటపడిన కుమారుడు
Shankarpally | శంకరపల్లి, ఆంధ్రప్రభ : శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గురు వారం అర్ధరాత్రి తల్లి కూతురు ఆత్మహత్య సంఘటన జరిగింది,, స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి వికారాబాద్ జిల్లా సంఘం గ్రామానికి చెందిన సుధాకర్ బ్రతుకుతెరువు కోసం శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చి స్థిరప డ్డాడు, ఆయనకు భార్య కుమారుడు కూతురు ఉన్నారు, కుటుంబ కలహాల కారణంగా గురు వారం రాత్రి ఇంట్లో గొడవపడి సుధాకర్ భార్య వసంత వయసు 35 సంవత్సరాలు కూతురు నవ్య, కుమారుడు వరుణ్, తో కలిసి పొలం వద్ద ఉన్న బావి దగ్గరకి వెళ్ళి బావి గట్టు వద్ద కూర్చొని తల్లి పిల్లలతో మాట్లాడి బోరున ఏడ్చి పదవ తరగతి చదువుతున్న నవ్య వయసు 15 సంవత్సరాల కూతురును మరియు ఏడవ తరగతి చదువుతున్న వరుణ్ వయసు 12 సంవత్సరాల కుమారుడిని బావిలోకి తోసేసి తాను బావిలోకి దూకేసింది, కుమారుడు వరుణ్ తల్లి తోసిన తర్వాత బావిలో ముళ్ల కొమ్మను పట్టుకొని తన ప్రాణాన్ని కాపాడుకోగా బావిలోకి దూకిన తల్లి కూతుర్లు చనిపోయినట్లు స్థానికు లు తెలిపారు, శంకర్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు, కుటుంబ కలహాలు, తల్లి తన పిల్లల్ని బావిలోకి తోసేయడానికి గల కారణాలు, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, శంకర్పల్లి పోలీసులు అందించే సమాచారం లో ఇంకా పూర్తి వివరాలు తెలియ రానున్నాయి.

