200-Mn-China-Us-Voter-Data : అమెరికాలో చైనా భూతం Andhra Prabha Top Story
200-Mn-China-Us-Voter-Data : అమెరికాలో చైనా భూతంAndhra Prabha Top Story
- ఓటర్ల డేటా దొబ్బేసింది
- ఫలితాలు తారుమారు చేస్తుంది
- ఇదీ ట్రంప్ కొత్త గోల
- వైట్ హౌస్ సాక్షిగా ఆరో.పణలు
- నిన్న డోనాల్డ్ హత్యకు ఇరాన్ కుట్ర
- ఈరోజు అమెరికా ఓటర్ల డేటా చైనా చోరీ
- ప్రపంచం ముక్కున వేలు
(ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి )
అమెరికాలో మధ్యంతన ఎన్నికల కోడి కూయక ముందే… అమెరికా అధ్యక్షుడు పానుభూతి ఓటు బ్యాంకుపై దృష్టి సారించారని రాజకీయ వర్గాలు సెటైర్లు దూస్తున్నాయి. రెండు మూడు రోజుల కిందట అమెరికా అధ్యశ్రీుడు డోనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ రెక్కీ ప్లాన్ రచిందని .. వైట్ హౌస్ నుంచి అధ్యక్షుడు ఆగ్ర్హం వ్యక్తం చేశారు. ఏమోఝ నిజమేనేమో? ఖమేనీని అమెరికా చంపేసిందని, బదులు ట్సంప్ కూడా ఇరానీయులు లేపేస్తారేమో అనే అనుమానాలు సర్వసాధారణం. కానీ ప్రపంచంంలోనే అతి పెద్ద రక్షణ వలయంలో భద్రంగా ఉన్న అమెరికా అధ్యక్షుడిని టార్గెట్ చేసే దమ్ము ఎవరికి ఉంటుంది? సరీతా ఇలాంటి స్థితిలొనే …అయెరికా ఓటర్ల కీలక సమాచారాన్ని చైనా దొబ్బేసింట. ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుందట.. ఇదీ అమెరికా అద్యక్షుడు ట్రంస్ కొత్త వివాదంతో ప్రపంచం నోరు వెళ్లబెట్టింది. అదేంటో చూద్దాం.
200-Mn-China-Us-Voter-Data : అంతా ,చైనా చేస్తోంది
అమెరికా ఎన్నికల వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేస్తున్నాయని తాను పేర్కొన్న నిఘా పత్రాలను తక్షణమే వర్గీకరణ నుండి తొలగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. లక్షలాది మంది అమెరికా ఓటర్ల సున్నిత సమాచారాన్ని చైనా తస్కరించినట్టు ఈ పత్రాలు నిరూపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
వైట్ హౌస్ నుంచి టెలివిజన్ ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ, దేశ ఎన్నికల వ్యవస్థలలో చాలాకాలంగా దాగి ఉన్న బలహీనతలను ఈ పత్రాలు బయటపెడతాయని అన్నారు.
“ఈ రాత్రి, మన ఎన్నికల వ్యవస్థలోని దిగ్భ్రాంతికర లోపాలను వెల్లడిస్తున్న కీలక నిఘా సమాచారాన్ని తక్షణమే వర్గీకరణ నుండి తొలగించి, విడుదల చేస్తున్నట్లు నేను ప్రకటిస్తున్నాను,” అని ట్రంప్ అన్నారు.
అమెరికా ఎన్నికల వ్యవస్థ హ్యాకింగ్, దుర్వినియోగం. విదేశీ జోక్యానికి గురయ్యే అవకాశం ఉందని ఈ సమాచారం చూపిస్తోందని, అలాగే ఆ సమాచారాన్ని ఏళ్ల తరబడి ప్రజల నుండి దాచిపెట్టారని ఆయన ఆరోపించారు.
“మన ఎన్నికల వ్యవస్థ హ్యాకింగ్, దుర్వినియోగం , విదేశీ జోక్యానికి ప్రమాదకరంగా గురవుతోందని ఈ సాక్ష్యం చూపిస్తోంది. అంతే ఆందోళనకరంగా, ఈ కీలక సమాచారం చాలా సంవత్సరాలుగా మీ నుండి కప్పిపుచ్చబడి, దాచిపెట్టబడింది,” అని ఆయన అన్నారు.
200-Mn-China-Us-Voter-Data : చైనా గుప్పిట్లో అమెరికా ఓటర్లు..
అమెరికా ఓటర్ల సమాచారం ఉన్న డేటాబేస్లను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేసిందని, వర్గీకరణ నుండి తొలగించిన రికార్డులు చూపిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడి ప్రకారం, ఆ సమాచారంలో పేర్లు, ఇంటి చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీ అనుబంధాలు మరియు ఓటర్ల నమోదుకు సంబంధించిన ఇతర వివరాలు ఉన్నాయి.
“ఓటు నమోదుకు , ఇతర దుర్మార్గపు కార్యకలాపాలకు పాల్పడటానికి అవసరమైన పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీ ప్రాధాన్యతలు , ఇతర సున్నితమైన సమాచారం ఇందులో ఉన్నాయి” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ సమాచారాన్ని అక్రమంగా పొందడం వల్ల ఓటర్ల నమోదులో మార్పులు జరిగాయని లేదా ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని చెప్పడానికి ఆయన తన ప్రసంగంలో ఎటువంటి ఆధారాలనూ చూపలేదు.
200-Mn-China-Us-Voter-Data గత నిఘా అంచనాలు ఏమిటొ,?
2020 ఎన్నికల సమయంలో, ప్రజాభిప్రాయ పరిశోధన కోసం చైనా నిఘా సంస్థలు బహిరంగంగా అందుబాటులో ఉన్న రాష్ట్ర స్థాయి ఓటర్ల నమోదు వివరాలను సేకరించి విశ్లేషించాయని అమెరికా
నిఘా సంస్థలు అలెర్ట్ చేసినా, విదేశీ ప్రభుత్వాలు ఓటరు నమోదు డేటాబేస్లను మార్చాయని లేదా ఓట్ల లెక్కింపును తారుమారు చేశాయని తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఫెడరల్ నిఘా సంస్థలు ఎన్నికల భద్రతా అధికారులు నిరంతరం చెబుతూ వస్తున్నారు.
సైబర్ దాడుల నుండి రక్షణకు వికేంద్రీకృత ఎన్నికల వ్యవస్థలు మరియు కాగితపు బ్యాలెట్ బ్యాకప్‌లు కీలకమని పేర్కొంటూ, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) యూఎస్ ఎన్నికలను అత్యంత సురక్షితమైనవిగా పదేపదే అభివర్ణించింది.
పేర్లు, చిరునామాలు ,పార్టీ అనుబంధంతో సహా ప్రాథమిక ఓటరు నమోదు సమాచారం చాలా యూఎస్ రాష్ట్రాలలో బహిరంగంగా అందుబాటులో ఉంటుంది రాష్ట్ర చట్టాల ప్రకారం రాజకీయ ప్రచారాలు, పరిశోధకులు ప్రజలు దీనిని చట్టబద్ధంగా పొందవచ్చు. ఇలాంటి స్థితిలో చైనా దొంగతనం ఇలా బయట పడిందా? అనేది అమెరికా రాజకీయ వర్గాల ప్రశ్న.
