మానవసేవే మాధవసేవ..
- ఉత్తమ సేవలందించడమే లక్ష్యంగా ముందుకు
- వైద్య వృత్తి చాలా గొప్పది
- ఏరియా ఆసుపత్రి బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉంది
- డాక్టర్ ప్రొఫెసర్ ముంత అశోక్
మంచిర్యాల, ఆంధ్రప్రభ : మానవసేవే మాధవ సేవ అని డాక్టర్.ప్రొఫెసర్.ముంత అశోక్ అన్నారు. వైద్య విధాన పరిషత్ ఉత్తర్వుల మేరకు జూలై 15న మంచిర్యాల జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గురువారం ఆంధ్రప్రభ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు తండ్రి రైల్వే ఉద్యోగి,తల్లి గృహిణిగా ముత్త శ్రీశైలం సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దవాడైన అశోక్ బాల్యం నుండే ఉన్నత విద్యను అభ్యసించి వైద్య వృత్తిలో సేవలందించాలనే దృక్పథంతో పట్టుదలతో ఇష్టపడి చదివి ప్రతి తరగతిలో ప్రధమ శ్రేణి మార్కులు సాధించి ఎంబిబిఎస్,జనరల్ ఫిజీషియన్ ముగించుకొవడం జరిగింది అన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యుడిగా నియమించబడి స్వస్థలం హైదరాబాద్ నుండి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామాలైన పీ హెచ్ సి లలో ఆరు సంవత్సరములు ప్రభుత్వ వైద్యునిగా విధులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.అనంతరం తిరిగి హైదరాబాద్ కాచిగూడ ఫీవర్ ఆస్పత్రిలో మరో ఐదు సంవత్సరములు సేవలందించగా తన సతీమణి డా.ప్రొఫెసర్ శారదా మంచిర్యాల వాస్తవ్యురాలు కావడంతో మంచిర్యాల జిల్లా ఏరియా ఆస్పత్రిలో మైక్రో బయాలజి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నరని.2023 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులైన భార్య భర్తల కోసం కల్పించిన స్పౌస్ వెసులుబాటుతో మంచిర్యాల మెడికల్ కళాశాల ఆస్పత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా జిల్లా ఆస్పత్రిలో సేవలను ప్రారంభించి ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్యశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి సూపరిండెంట్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు.ఈ ఆసుపత్రి కి వస్తున్న మంచిర్యాల పరిసర ప్రాంతంలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు.వైద్య వృత్తి చాలా గొప్పదని భగవంతుని తర్వాత వైద్యో నారాయణ అనే నానుడి వైద్యుల పట్ల ఉండే గౌరవం అన్నారు.అనేక సందర్భాలలో గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ప్రమాదాలు,విష ప్రయోగాలు,ప్రాణాపాయ స్థితులలో వచ్చినటువంటి రోగులను జనరల్ ఫిజీషియన్ వైద్యునిగా విధులు నిర్వహించి వారి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.
చికిత్స అనంతరం పేషెంట్లు కృతజ్ఞతతో ఇచ్చే ఆశీర్వాదాలు వైద్య వృత్తి పట్ల గౌరవం పెంచుతుందన్నారు. వైద్య వృత్తి అంటే చాలా గొప్పదని ఆ వృత్తిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిరోజు 330 ఇన్ పేషంట్లతో (అడ్మిట్) నిత్యం రద్దీగా ఉంటున్న ఆసుపత్రిలొ వారితో పాటు రోజుకు 1200 మందికి పైగా అవుట్ పేషెంట్లుగా ( ఓపి ) ద్వార సేవలందించడం జరుగుతుందన్నారు. రేడియాలజీ విభాగంలో మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్యుడు చాలా ప్రాముఖ్యమని లోటు ఉందని ప్రస్తుతానికి ఒక హెచ్ ఓ డి వైద్యురాలు తో పాటు పీజీ విద్యార్థులతో రేడియాలజీ విభాగంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు సిబ్బంది కొరత ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించడం జరిగిందన్నారు.
నిబద్ధతతో తోటి వైద్యులు, నర్సింగ్ అధికారులతో అందరితో కలిసి మెలిసి తారతమ్యాలు లేకుండా సమన్వయం కలిగి ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగులకు స్వచ్ఛమైన వైద్య సేవను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుందన్నారు. గతానికి భిన్నంగా మంచిర్యాల శాసనసభ్యుడు,జిల్లా పాలన అధికారి ఇరువురు వైద్య రంగంలో లోటుపాటులను సరిచేస్తూ ఈ ప్రాంత ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందించేందుకు నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.ఆసుపత్రికి వస్తున్నటువంటి వారి ని ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయకుండా సురక్షితమైనటువంటి వైద్య సహాయం అందించేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
