సొంత నిధులతో ప్రతినెల పించన్..
- సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.
పాయకాపురం, ఆంధ్రప్రభ : సొంత నిధులతో ప్రతి నెల పెన్షన్లు అందజేస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నామని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
స్థానిక 64వ డివిజన్‌కు చెందిన గజ్జెల కొండా ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే బొండా ఉమా స్పందించారు. గురువారం డివిజన్ పర్యటనలో భాగంగా ఆయనకు రూ.4 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తన సొంత నిధులతో ప్రతి నెల వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, ప్రధాన కార్యదర్శి బాబు, కోమరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
