అమ్మవారి ప్రసాద సేవకు ఉదార విరాళం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: నగరంలోని ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా అందించే ప్రసాద పథకానికి రూ.1,11,111/- ను ఒగిరాలకు చెందిన గుంటక దుర్గాప్రసాద్ రెడ్డి భార్య ఇంద్రజ ఆలయంలోని అధికారుల్ని అర్చక స్వాములను కలిసి భక్తిశ్రద్ధలతో విరాళము సమర్పించి ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ప్రధానాలి సూపర్నెంట్ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను దాతకు అందజేశారు.