రథంపై కొలువైన జగన్నాథుడు.. విశాఖలో భక్తి సంద్రం!
- ఎటు చూసినా భక్తజన కోలాహలం
- జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల ప్రత్యేక పూజలు
విశాఖపట్నం, ఆంధ్రప్రభ: కోరిన కోర్కెలు తీర్చే జగన్నాథ స్వామి అత్యంత శక్తి స్వరూపులని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు…జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి …ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి.. డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు.. గురువారం ఇక్కడ విశాఖ పాత నగరంలో రథంపై కొలువైన శ్రీ జగన్నాథ.. బలబద్ర సుభద్రలను గంట్ల శ్రీనుబాబు దర్శించుకున్నారు. అలాగే జగన్నాథ ఆలయంలో కొలువున్న జగన్నాథ స్వామిని.. ఇతర దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. రథంపై కొలువున్న జగన్నాధుని దర్శించుకుంటే సర్వపాపాలు హరించుకు పోవడంతో పాటు పునర్జన్మ ఉండదన్నది పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయన్నారు.. అలాగే భక్తులు కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయనీ కూడా భక్తకోటి ప్రగాఢ విశ్వాసం గా భావిస్తారన్నారు…. జగన్నాధుని దర్శించు కున్న భక్తులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం చల్లగా ఉంటారన్నది కూడా భక్తకోటి ప్రగాఢ విశ్వాసమ న్నారు..విశాఖలో పది రోజులు పాటు జగన్నాథుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చి కనువిందు చేస్తారని ఇక్కడ టర్నర్ చౌల్ట్రీ లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. కావున భక్తులంతా జగన్నాధుడు ..బలభద్ర .. సుభద్రలను దర్శించుకుని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు.
