161Types | వాట్సాప్ గవర్నెన్స్‌లో అనకాపల్లి మూడో స్థానం
161Types | వాట్సాప్ గవర్నెన్స్‌లో అనకాపల్లి మూడో స్థానం
161Types | పెండింగ్ అభివృద్ధి పనుల పూర్తి కోసం ప్రత్యేక చర్యలు
జీరోవేస్ట్ స్కూళ్లతో రాష్ట్ర దృష్టిని ఆకర్షించిన అనకాపల్లి
ముఖ్యమంత్రి ప్రశంసలు పొందిన కలెక్టర్ విజయ కృష్ణన్
వాట్సాప్ గవర్నెన్స్, ఈ-కేవైసీపై సమీక్ష
‘మనమిత్ర’ యాప్‌తో ప్రజలకు ప్రభుత్వ సేవలు
జలధార-జలహారతి కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి
సచివాలయ సిబ్బందితో వేగవంతమైన అమలు చర్యలు
161Types | అనకాపల్లి, ఆంధ్రప్రభ : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చిత్త శుద్ధితో పనిచేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను జీరోవేస్ట్ స్కూళ్లుగా మార్చుతూ వినూత్న ప్రయత్నం జిల్లా కలెక్టర్ల సదస్సు దృష్టిని ఆకర్షించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ప్రశంసలతో ఆయన చేసిన పలు సూచనలు వంద శాతం అమలుకు జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ -టైనింగ్, సిటిజన్ ఈ-కేవైసీ, యునై-టె-డ్ ఫ్యామిలీ సర్వేకు సంబంధించిన పెండింగ్ డేటా అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
రాష్ట్రస్థాయిలో జిల్లా మూడవ స్థానంలో ఉన్నప్పటికీ, మరింత పురోగతికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే చేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ యాప్‌పై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రజలు తమ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాదాపు 161 రకాల పౌర సేవలను వాట్సాప్, మొబైల్ యాప్ ద్వారా నేరుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి సూచనలు పరిగణనలోకి తీసుకుని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక జలధార – జలహారతి కార్యక్రమంపై ప్రధానంగా దృష్టి సారించడమే కాక జలవనరుల శాఖ, ఇతర అనుబంధ విభాగాల సమన్వయంతో పనులు ముమ్మరంగా చేపట్టేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
CLICK HERE TO READ భూ సమస్యల పరిష్కారంలో నెల్లూరు అగ్రస్థానం
