నాలుగు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్.. సీఐ అభినందనలు
పరకాల (ఆంధ్రప్రభ): తెలంగాణ ఐదవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించిన పరకాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగేల్లి సుజాతను సీఐ వి. క్రాంతికుమార్ అభినందించారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో జూలై 7 నుంచి 9 వరకు నిర్వహించిన తెలంగాణ ఐదవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో పాల్గొన్న సుజాత విశేష ప్రతిభ కనబరిచారు.
ఈ పోటీల్లో పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం, బాక్సింగ్‌లో కాంస్య పతకం, వుషూ విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పరకాల పోలీస్ స్టేషన్లో సీఐ వి. క్రాంతికుమార్ ఆమెను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ టి. సర్వన్, కానిస్టేబుల్ రాజయ్య, మహిళా కానిస్టేబుల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
