drugs| ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
drugs| ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
మంగళ్‌హాట్‌లో పోలీసుల దాడులు.. గంజాయి, హాష్ ఆయిల్ స్వాధీనం
మరో నలుగురు పరారీలో.. డ్రగ్స్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు ముమ్మరం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగిస్తున్నారనే సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్ రాజ్ రెడ్డితో పాటు అభిషేక్, బొట్టు యూనిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి గంజాయి, హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పురానాపూల్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వీరు సమావేశమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు. మత్తు పదార్థాలు తీసుకున్నారనే అనుమానంతో నిందితుల నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. ఇదే కేసులో సోని, వంశీ, మనోజ్, తులజ అనే మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్, మూలాలు, ఇతర సంబంధాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
