NEWS@01:00 P.M | 14 జూలై 2026 ముఖ్యాంశాలు
NEWS@01:00 P.M | 14 జూలై 2026 ముఖ్యాంశాలు
Aviation | మామునూరు ఎయిర్‌పోర్టుపై కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా అదిలాబాద్ విమానాశ్రయంతో పాటు వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
6-Murder-Case : ఆ నలుగురే Andhra Prabha Crime Analysis
తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఓ మానవ మృగం స్వెరవిహారం చేసింది. ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మహిళలను అతి కిరాతంగా చంపేసింది. ఈ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లోని సభ్య సమాజాన్ని కలవరపర్చింది. ఈ,దారుణ ఘటన జరిగిన మూడు రోజులకే నరహంతకుడు తనకు తానే మరణశిక్ష విధించుకున్న సమాచారంతో… సభ్య సమాజం చల్లబడింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఈ మారణ కాండ వెనుక మరో కోణం వెలుగులోకి వచ్చింది. తన మరణ వాంగ్మూలంలో… తన రాక్షసత్వానికి ఆ నలుగురే కారణమని … తేల్చి చెప్పాడు. ఇందులో నిజనిజాలను పక్కన పెడితే.. నవీన మానవ సంబంధాల్లో.. మానసిక దౌర్భాగ్యం ఏ దారి తీస్తుందో.. జనం తమ మదిలో తాము ప్రశ్నించుకోక తప్పదు.
Breaking news | HMDA చీఫ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు..
తెలంగాణలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు సంబంధించిన నివాసం, కార్యాలయం, సన్నిహితుల ఇళ్లలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ బృందాలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నాయి.
వరప్రసాద్ రెడ్డి మృతిపై హోంమంత్రి అనిత సంతాపం.. విచారణకు ఆదేశాలు
కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా సమీప జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి (43) మృతిచెందిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
National Highways | జాతీయ రహదారులపై కీలక చర్చ
జాతీయ రహదారులపై కీలక చర్చఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త రహదారి ప్రతిపాదనలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో వివిధ దశల్లో నిలిచిపోయిన జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం.
