ఆలేరు, ఆంధ్రప్రభ : రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత( పార్లమెంటరీ పార్టీ లీడర్ )గా నియమితులైన వద్దిరాజు రవిచంద్రను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జేడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి సత్కరించారు, రాజ్యసభ పక్ష నేతగా రాణించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.