జాతీయ రహదారిపై టిప్పర్ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
పామర్రు, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురజాడ సమీపంలో వేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి వంతెన కల్వర్టును ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పమిడిముక్కల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు.
