NEWS@10:00 A.M | 13 జూలై 2026 ముఖ్యాంశాలు
కోకో సిటీపై ఫోకస్.. ప్రీమియం చాక్లెట్ల హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం కోకో ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్, విలువ ఆధారిత విధానాలకు విస్తృత ప్రణాళికలు రూపొందించింది. దేశంలో కోకో ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచేందుకు ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 40 వేల హెక్టార్లలో కోకో సాగు జరుగుతుండగా, ఏటా 18-20 వేల మెట్రిక్ టన్నుల డ్రై కోకో బీన్స్ ఉత్పత్తి అవుతున్నాయి. click here to read the full story
జూన్‌లో రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు 34% పెరుగుదల
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు గత నెలతో పోల్చితే జూన్‌లో 34 శాతం పెరిగాయి. జూన్‌లో భారత్ 4.5 బిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును కొనుగోలు చేసిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక వెల్లడించింది. click here to read the full story
వికారాబాద్‌పై మరో భూసేకరణ భారం.. బుల్లెట్ రైలు నుంచి రిజర్వాయర్ల వరకు భూముల వేట
మరో భూసేకరణకు సర్కార్ సిద్ధపడుతోంది. బుల్లెట్ రైలుకు భారీగా భూమి సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టినా జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతిసమీపంలో ఉండడంతో అన్ని ప్రాజెక్టులు జిల్లాలో చేపట్టడం లేదంటే జిల్లా మీదుగా వెళుతున్నాయి. click here to read the full story
మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఎప్పుడూ? ప్రతిపాదనలు పెండింగ్‌లోనే
రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో వ్యవహారం గుదిబండగా మారుతోంది. మెట్రో టేకోవర్ గడువు తీరింది. ఎల్ అండ్ టీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వంపై రోజుకు రూ.2.5 కోట్ల వడ్డీ భారం పడుతోంది. కేంద్రం నుంచి 50:50 జాయింట్ వెంచర్ అనుమతుల్లోనూ తీవ్ర జాప్యం నెలకొంటున్నది. దీంతో ఇక స్పష్టత రాకపోతే ప్రత్యామ్నాయ నిధులతో ఫేజ్-2 పనులను ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నట్లు తెలిసింది. click here to read the full story
గంజాయికి గుడ్‌బై.. గిరిజన ప్రాంతాల్లో రంబుటాన్ సాగుకు గ్రీన్ సిగ్నల్
ఒకప్పుడు ఆక్రమ గంజాయి సాగుకు కేంద్రంగా పేరొందిన మన్యం గిరిజన ప్రాంతాలు ఇప్పుడు అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటల సాగుకు చిరునామాగా మారుతోంది. గిరిజన రైతులను చట్టవిరుద్ధమైన గంజాయి సాగు నుంచి పూర్తిగా దూరం చేసి, శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రంబుటాన్ సాగును ప్రవేశపెట్టింది. click here to read the full story
వింబుల్డన్ చాంపియన్‌గా సిన్నర్..
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్-2026 ఛాంపియన్‌షిప్‌కు తెరపడింది. ప్రపంచ టెన్నిస్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుతూ ఇటలీ స్టార్ జానిక్ సిన్నర్ వింబుల్డన్-2026 పురుషుల సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జర్మనీకి చెందిన ప్రపంచ నంబర్-2 అలెగ్జాండర్ జ్వెరెవ్ ను 6-7(7), 7-6(2), 6-3, 6-4తో ఓడించిన సిన్నర్.. వరుసగా రెండో వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. click here to read the full story
