Sensex Crash | 600 పాయింట్లు డౌన్..!
Sensex Crash | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
ఉదయం ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 605 పాయింట్లు క్షీణించి 76,964 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పడిపోయి 24,029 వద్ద ట్రేడవుతున్నాయి.
నిఫ్టీ సూచీలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా షేర్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఇక విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.72 వద్ద ప్రారంభమైంది.
