ఫారాల డిజిటైజేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలి.
వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
పాయకాపురం, ఆంధ్రప్రభ : క్షేత్ర స్థాయిలో సర్ కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వైసీపీ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 58వ డివిజన్ ఆంధ్రప్రభ కాలనీలో బూత్ నెంబర్ 42,43, 48 సర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డితో కలసి పరిశీలించారు.
ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిరంతర పర్యవేక్షణ జరగాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రెసిడెంట్ యేసు స్థానిక డివిజన్ అధ్యక్షుడు రాజా రెడ్డి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మహిళా ప్రెసిడెంట్ తోపుల వరలక్ష్మి,చక్రాల శోభన్, గోపి రెడ్డి, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
