ఎస్‌ఐఆర్ ఫారాలను గడువులోగా సమర్పించాలి: భోగ గోవర్ధన్

కుంటాల, ఆంధ్రప్రభ : ఎస్‌ఐఆర్ సర్వే నిర్వహణలో భాగంగా ఆదివారం కుంటాల మండలంలోని అంబకంటి గ్రామంలో బీజేపీ నాయకులు బీఎల్‌ఓ-2కు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి భోగ గోవర్ధన్ మాట్లాడుతూ, అధికారులు అందజేసిన ఎస్‌ఐఆర్ ఫారాలను గడువులోగా సంబంధిత బీఎల్‌ఓలకు తప్పనిసరిగా అందజేయాలని ప్రజలకు సూచించారు. ఫారాలు నింపే విషయంలో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే పార్టీ కార్యకర్తలు సహకరించి వివరాలు నమోదు చేయించేందుకు సహాయం చేయాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యాన్ని గుర్తించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన వివరాలను పూర్తి చేసి గడువులోగా సమర్పించాలని కోరారు.

అదేవిధంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని, కార్యకర్తల కృషితోనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగాదాస్, శ్రీరామ్, గజేందర్, చందు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.