నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యం అందించే నిత్య అన్నదాన పథకానికి మచిలీపట్నం ప్రాంతానికి చెందిన సిహెచ్ లలిత కుటుంబీకులు, రూ. 1,00,000/- విరాళంగా సమర్పించారు.

ఈ విరాళాన్ని ఆలయ అధికారులు అర్చక స్వాముల సమక్షంలో వారు స్వయంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం ప్రధానాలయ సూపర్డెంట్ డి వి సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.