NEWS@9:30 P.M | 11 జూలై 2026 ముఖ్యాంశాలు

important news updates

ముందస్తు సమాచారం ఇచ్చినా తప్పని ఘోర అవస్థలు

వరుస సెలవులతో పోటెత్తిన జనానికి తప్పని తిప్పలు!
కొండపైకి వాహనాల నిలిపివేతతో వృద్ధులు, పిల్లలకు ఇబ్బందులు
కోనేట్లో నీళ్లు లేక కాలకృత్యాలకు భక్తుల అవస్థలు
ప్రమాణ స్వీకారం ముగిసేవరకు ‘నరసింహుడి’ దర్శనాలు బంద్

దర్శనం కాక, కిందకు వెళ్లలేక ఘాట్ రోడ్డుపైనే ప్రహసనం!

ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం దేవస్థానంలో వైభవంగా జరిగినప్పటికీ, అదే సమయంలో స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులకు మాత్రం ఈ కార్యక్రమం తీవ్ర నరకాన్ని మిగిల్చింది. click here to read full news


ఈ నెల 17న ప్రారంభం.. విజయవాడ రద్దీకి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్ సిద్ధం… ఎంపీ కేశినేని చిన్ని చొరవతో వేగంగా పూర్తైన అమృత్ భారత్ పనులు..లిఫ్టులు.. ఏసీ వెయిటింగ్ హాల్.. విశాల ప్లాట్‌ఫారాలు..
ప్రయాణికులకు ప్రపంచస్థాయి కార్పొరేట్ వసతులు…
కొండపల్లి కళారూపాలతో మెరిసిన స్టేషన్..
భవిష్యత్ రైల్వే హబ్‌గా రాయనపాడు
ప్రతిరోజూ 12 రైళ్లు..
త్వరలో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా నిలయంగా మారనున్న స్టేషన్.. ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ : విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌పై రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి శాశ్వత పరిష్కారంగా రూపుదిద్దుకున్న రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముస్తాబైంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.35 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక ప్రమాణాలతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికాగా, ఈ నెల 17న స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిరంతర అనుసరణ, కేంద్ర రైల్వే శాఖతో సమన్వయం కారణంగా రికార్డు సమయంలో పనులు పూర్తవడంతో రాయనపాడు ఇక విజయవాడకు ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్‌గా సేవలందించేందుకు సిద్ధమైంది. click here to read full news

ఎస్. జానకి మృతికి తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దిగ్గజ నేపథ్య గాయని, గానకోకిల ఎస్. జానకి మరణం పట్ల తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ విడుదల చేసిన ప్రకటనలో, “స్వర సరస్వతి మౌనమైంది… కోకిల గానం కాలగర్భంలో కలిసిపోయింది… తెలుగు గుండెల్లో శాశ్వతంగా మారుమోగే ఆ మధుర స్వరం నేడు మౌనమైంది” అని పేర్కొంది. తరతరాల సంగీతాభిమానులను తన గానామృతంతో అలరించిన ఎస్. జానకి మరణం సంగీత ప్రపంచానికే కాకుండా ప్రతి సంగీత ప్రేమికుడికి తీరని విషాదాన్ని మిగిల్చిందని తెలిపింది. click here to read full news

Shabad Murder Case | షాబాద్ నిందితుడి కోసం పోలీసుల ప్రకటన

Shabad Murder Case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. click here to read full news

Shabad Murders | సీఎం రేవంత్ రాజీనామా చేయాలి…

Shabad Murders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : షాబాద్‌లో చోటుచేసుకున్న ఆరు హత్యల ఘటనపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనను “ప్రభుత్వ హత్యలు”గా అభివర్ణించారు.

షాబాద్‌లో జరిగిన హత్యలు హృదయవిదారకమని, ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని హరీశ్ రావు ఆరోపించారు. కేవలం ఎస్‌ఐని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. click here to read full news

Chicken Prices | నాన్‌వెజ్ ప్రియులకు షాక్

Chicken Prices | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడంతో నాన్‌వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. గత రెండు వారాల వ్యవధిలోనే ధరలు గణనీయంగా పెరగడంతో మార్కెట్లలో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలతో పోలిస్తే కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగాయి. ప్రస్తుతం స్కిన్‌తో కూడిన బ్రాయిలర్ చికెన్ కిలో రూ.290 click here to read full news

CM Revanth Reddy | రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

CM Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హరీశ్ రావు పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “హరీశ్ రావు కేసీఆర్ తయారు click here to read full news

Vietnam-Boat-Capsize : ప్రమోద యాత్రలో.. పెను విషాదం..

Vietnam-Boat-Capsize : వ్యాపార లక్ష్యాలను అధిగమించిన ఆనందంలో.. ఓ కంపెనీ ఏర్పాటు చేసిన విహారయాత్ర ఘోర విషాదంగా మారింది. ఏపీ తెలంగాణకు చెందిన 75 మంది వియత్నాంలో పర్యటిస్తున్న తరుణంలో.. అలల తాకిడితో.. ఓ బోటు తల్లకిందులు కాగా.. 32 మంది సముద్రంలో మునిగిపోయారు. వీరిలో ఇప్పటికి 18 మంది మృతి చెందినట్టు మీడియాలో ప్రచారం జరగుతోంది ఓ ప్రమోదం ప్రమాదంగా మారింది. కన్నీటి సంధంబ పొంగింది. ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి click here to read full news