రెడ్డి ఐక్యవేదిక మండల అధ్యక్షుడుగా లింగారెడ్డి
సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివ నగర్ మండల రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షునిగా పద్మాజివాడి గ్రామానికి చెందిన ఎర్రవటి లింగారెడ్డిని శనివారం ఎన్నుకున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో రెడ్డి ఐక్యవేదిక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడుగా ఎర్రవటి లింగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాణాల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు బద్దం రాజిరెడ్డి, ఏనుగ జైపాల్‌రెడ్డి, కార్యదర్శి ఆకిటి మహేందర్‌రెడ్డి, కోశాధికారి, మర్కంటి జగన్‌రెడ్డి, ఆలకొండ శ్రీనివాస్‌రెడ్డి, ఏలేటి సంజీవరెడ్డి లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాజ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొప్పుల గంగారెడ్డి ,మోతే రాంరెడ్డి, జిల్లా అడక్ కమిటీ కన్వీనర్ జుక్కంటి మోహన్‌రెడ్డి, జిల్లా వర్కింగ్ కన్వీనర్ బాణాల మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క ప్రతాప్‌రెడ్డి,జిల్లా కార్యదర్శి అంజిరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కందడి ప్రవీణ్‌రెడ్డి, సదాశివనగర్ గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
