ఆంధ్రప్రభ యాప్ కు స్పందన..
- వంగిన విద్యుత్ స్తంభాల సరి చేయిస్తున్న కాంట్రాక్టర్
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ లో విద్యుత్ కాంట్రాక్టర్ల నాసికరకం పనులుపై ఆంధ్రప్రభ యాప్ లో ఉదయం వార్త బ్ప్రచురించడం జరిగింది.ఆ వార్తలో కొద్దీపాటి వర్షానికి స్తంబాలు ఒరిగిపోయాయని, ట్రాన్స్ఫార్మర్ గద్దెతో పాటు వంగిపోయిందని,పెద్ద విద్యుత్ లైను,చిన్న లైన్ పై పడేఅవకాశం ఉందని తదితర నాసికరకం పనుల గురించి ఫొటోలతో సహా ప్రచురించడం జరిగింది.దీనిని స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు,కాంట్రాక్టర్లు తక్షణమే దిద్దుబాటు చర్యకు పూనుకోవడం జరిగింది. ముందస్తుగా వంగిపోయిన స్తంభాలను సరి చేయటం ప్రారంభించారు.దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యతమైన పనులు జరిగే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

