మారుగూడ తాగునీటి సమస్యకు పరిష్కారం..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని రాఘాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మారుగూడ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, మాజీ జడ్పీటీసీ కోవ అరుణ, మాజీ ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి, మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోడసం ధర్మరావు కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజల సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గ్రామానికి అత్యవసరంగా బోరు మోటారు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు మారుగూడ గ్రామానికి వెళ్లి గ్రామస్థుల సమక్షంలో మోటారు బిగించి తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ మాజీ చైర్మన్ కనక యాదవరావు మాట్లాడుతూ.. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి, సమస్యను చెప్పగానే వెంటనే స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మారుగూడ గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మెస్రం భీంరావు, వార్డు సభ్యురాలు మెస్రం దుర్పత బాయి, ఆడ జైవంతరావు, ఏర్మ జంగు, మెస్రం సోనేరావు, ఆడ లింగరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.