వేములవాడలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
వేములవాడ, ఆంధ్రప్రభ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలో బీజేపీ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో భీమేశ్వరాలయంలో కోడిమొక్కు చెల్లించి, బండి సంజయ్ కుమార్ దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాల కోసం స్వామివారిని ప్రార్థించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ జన్మదిన వేడుకలను నిర్వహించారు. రానున్న రోజుల్లో బండి సంజయ్ కుమార్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కౌన్సిలర్లు కుమ్మరి శంకర్, ముత్యం, మైలారం శ్రీనివాస్, శ్రీకాంత్, నాయకులు గోపు బాలరాజు, కటకం శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
