43-Hire-Buses-Bandh : గుడివాడలో ఉద్రిక్తత Andhra Prabha Top News
43-Hire-Buses-Bandh : గుడివాడలో ఉద్రిక్తత Andhra Prabha Top News
- ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవరుపై దాడి
- నిరసనగా 43 బస్సులు బంద్
- విద్యార్థులు, ప్రయాణికుల అగచాట్లు
( గుడివాడ – ఆంధ్రప్రభ)
43-Hire-Buses-Bandh : గుడివాడ – విజయవాడ ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ పై మానికొండ వద్ద దాడి జరగడాన్ని నిరసిస్తూ గుడివాడ ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ హెయిర్ బస్సుల యూనియన్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు కండక్టర్లు బంద్ కు దిగారు.
డిపో పరిధిలోని 43 హెయిర్ బస్సులను డ్రైవర్లు, కండక్టర్లు నిలిపివేయడంతో జిల్లాలో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేపట్టిన కార్మికులతో డిపో మేనేజర్ సునీల్ కుమార్ చర్చలు జరిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన ఆపేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. ఈ ఆందోళనకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.
బాధిత డ్రైవర్ దుర్గారావు మాట్లాడుతూ, “కానూరు వద్ద ఓ యువకుడు బస్సు ఆపమని అడిగాడు. సీట్లు ఖాళీ లేకపోవడంతో కొంత దూరం వెళ్లి బస్సు ఆపానన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు దుర్భసలాడాడని నేను ప్రతిగా స్పందించినట్లు డ్రైవర్ చెప్పాడు. మార్గమధ్యలో మానికొండ వద్ద యువకుడి సమాచారంతో అతని కుటుంబ సభ్యులు బస్సును చుట్టుముట్టి నాపై విచక్షణారహితంగా దాడి చేశారు” అని దుర్గారావు తెలిపారు.

సీఐటీయూ నేత మాట్లాడుతూ
“స్త్రీ శక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణాలు పెరిగాన్నారు. రద్దీ కారణంగా బస్సులు ఆపకపోతే పలుచోట్ల డ్రైవర్లపై దాడులు జరుగుతున్నాయన్నారు.రాష్ట్రంలోని హెయిర్ బస్ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని” ఆర్.సి.పి రెడ్డి డిమాండ్ చేశారు.
దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెయిర్ బస్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
నిరసన కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రేపానికొండ, కార్మికుల యూనియన్ నాయకులు… టీ తేజ, జి మహేష్, ఎం నాగార్జున, ఎం పవన్ కుమార్, జాజుల మురళి, యోహాను, ఎస్ అప్పలరాజు, వై అయ్యప్ప ఎండి యూసఫ్ , తదితరులు పాల్గొన్నారు.
