11-tmc-in-1-week : తుంగభద్ర దూకుడు Andhra Prabha Top News
11-tmc-in-1-week : తుంగభద్ర దూకుడు Andhra Prabha Top News
- వారంలోనే జలకళ
- 11 టీఎంసీల పెరుగుదల.
- సాగుపై రైతుల్లో ఆశల చిగురు.
(కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ ):

కర్ణాటకలోని పశ్చిమ కనుమలు, ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వారం రోజులుగా కురుస్తున్న విస్తార వర్షాలు తుంగభద్ర జలాశయానికి వరంగా మారాయి. గత వారం వరకు ఆందోళన కలిగించిన నీటి నిల్వలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. గత వారం సుమారు 9 టీఎంసీల వద్ద ఉన్న నిల్వ ప్రస్తుతం 20.826 టీఎంసీలకు చేరింది. అంటే కేవలం వారం రోజుల్లోనే దాదాపు 11 టీఎంసీలకు పైగా నీరు జలాశయంలో చేరింది. దీంతో రాయలసీమ రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతుండగా, దిగువకు నీటి విడుదలను కనిష్ఠ స్థాయిలో కొనసాగిస్తున్నారు. దీంతో వచ్చిన నీరంతా నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడుతోంది.
11-tmc-in-1-week : జలాశయ పరిస్థితి
తుంగభద్ర జలాశయం పూర్తి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1,599.45 అడుగులకు చేరింది. జలాశయం మొత్తం నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.826 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
గడచిన 24 గంటల్లో (శనివారం) సగటున 38,977 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరగా, ప్రస్తుతం ప్రత్యక్ష ఇన్‌ఫ్లో 35,810 క్యూసెక్కులుగా నమోదైంది. మరోవైపు జలాశయం నుంచి కేవలం 464 క్యూసెక్కుల నీటినే కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. నదిలోకి ఎలాంటి నీటి విడుదల లేదు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీరు దాదాపు పూర్తిగా నిల్వ అవుతోంది.
11-tmc-in-1-week : రైతుల్లో పెరిగిన ఆశలు
గత నెల రోజులుగా తుంగభద్రలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఖరీఫ్ సాగుపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు వరుసగా పెరుగుతున్న ప్రవాహంతో సాగునీటి లభ్యతపై ఆశలు బలపడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఇదే స్థాయిలో కొనసాగితే రానున్న రోజుల్లో నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
గ 11-tmc-in-1-week : త ఏడాదితో పోలిస్తే
గత ఏడాది ఇదే రోజున జలాశయంలో 76.030 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, నీటిమట్టం 1,624.86 అడుగులకు చేరుకుంది. అప్పట్లో ఇన్‌ఫ్లో 41,972 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 40,657 క్యూసెక్కులు నమోదయ్యాయి. ప్రస్తుతం గత ఏడాదితో పోలిస్తే నిల్వ తక్కువగానే ఉన్నప్పటికీ, గత వారం రోజులుగా నమోదవుతున్న వరద ప్రవాహం పరిస్థితిని గణనీయంగామెరుగుపరుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.
11-tmc-in-1-week : పదేళ్ల సగటును దాటిన నిల్వ
గత పదేళ్ల ఇదే తేదీ సగటు నీటి నిల్వ 34.026 టీఎంసీలు, సగటు ఇన్‌ఫ్లో 31,889 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో ఆ సగటును మించి కొనసాగుతుండటం విశేషం. ఈ ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే జలాశయంలో నిల్వలు వేగంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
11-tmc-in-1-week : రాయలసీమకు ఊరట
తుంగభద్ర జలాశయం కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ వ్యవసాయానికి కీలక ఆధారం. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న వరదలు కొనసాగడం ఖరీఫ్ సాగుకు శుభపరిణామంగా భావిస్తున్నారు. శ్రీశైలం, తుంగభద్ర, ఇతర జలాశయాల్లో నిల్వలు పెరగడం వల్ల సాగునీటి పంపిణీపై ఉన్న అనిశ్చితి కొంతవరకు తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
