లంచం అడిగారా… సమాచారం ఇవ్వండి
- అవినీతి అధికారుల భరతం పడతాం
- కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి
కరీంనగర్, ఆంధ్రప్రభ: ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి సమాచారం ఇవ్వాలని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ జి. మహేందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కరీంనగర్ ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు అవినీతికి సంబంధించిన ఫిర్యాదులతో ఎప్పుడైనా ఏసీబీని సంప్రదించవచ్చన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ఏసీబీ అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
లంచం అడిగే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ మహేందర్ రెడ్డికి ఏసీబీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
