అంబం (వై) ఆత్మహత్య కేసులో ఇద్దరు అరెస్ట్
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలంలోని అంబం (వై) గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య (27) ఆత్మహత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 30, 2026న సాయంత్రం మల్లయ్య తన ఇంటి బెడ్రూంలో నైలాన్ తాడుతో ఉరివేసుకుని మృతి చెందాడు. ఘటనపై మృతుడి తల్లి కురుమ గంగవ్వ తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో మృతుడి భార్య కురుమ స్వరూపతో పాటు అదే గ్రామానికి చెందిన సుమన్ వేధింపుల కారణంగానే మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఘటనను సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు.
దీంతో నిందితులు కురుమ స్వరూప, సుమన్లను జూలై 9న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించినట్లు ఎస్ఐ ముత్యాల రమ తెలిపారు.
