డ్రగ్స్ నిర్మూలనకు హన్వాడలో ప్రత్యేక తనిఖీలు

హన్వాడ, ఆంధ్రప్రభ: డ్రగ్స్, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా హన్వాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో మండలంలోని పలు దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బందితో పాటు స్పెషల్ డాగ్ స్క్వాడ్ బృందం పాల్గొంది.