మహాద్వార్ ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని మహాద్వార్ గ్రామంలో గురువారం రోజు ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులైన బుడబోయి భీమమ్మ, మంగలి రేణుకమ్మ ల నూతన గృహాల గృహప్రవేశం అత్యంత ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సోదరుడు మాజీ ఉప సర్పంచ్ వాకిటి శేషగిరి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి.గణేష్ కుమార్ హాజరై నూతన గృహాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, ప్రతి అర్హుడికి ఇల్లు మంజూరు చేసే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్ల సత్యనారాయణ, బాట విశ్వనాథ్, వడ్ల నర్సింహ,బుదబోయి బాలు, బలిజ సిద్దు, గణపురం గోవర్ధన్ ,మంగలి నగేష్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు బుడబోయి భీమమ్మ, మంగలి రేణుకమ్మ మాట్లాడుతూ, తమ చిరకాల సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply