కేరళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సందర్శించిన ఎంఈఓ
కడెం, ఆంధ్రప్రభ : కడం మండల కేంద్రంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను కడెం మండల విద్యాధికారి ఎం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులు, ఉపాధ్యాయుల విద్యార్హతలు, విద్యార్థులకు అందిస్తున్న బోధన విధానాన్ని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయవద్దని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. అలాగే పాఠశాలల్లోనే పుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను బలవంతం చేయరాదని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల హెచ్ఎం వినీత్ తదితరులు ఉన్నారు.
