కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి సన్మానం..
మంగపేట, ఆంధ్రప్రభ : మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లును జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, ఆర్టీఏ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ మండల కేంద్రమైన మంగపేటలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా చిటమట రఘు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి, మంత్రి సీతక్కకు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య. ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కమిటి జిల్లా సభ్యులు మురుకుట్ల నరేందర్, కాంగ్రెస్ పార్టీ నరసింహసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు తాతినేని హరికృష్ణ, నాయకులు కొమరం సారయ్య, కొమరం బిక్షపతి, లక్ష్మీపతి, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
