ఘనంగా జలంధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : రియల్ శ్రీమంతుడు, అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అండపల్లి జలంధర్ రెడ్డి జన్మదిన వేడుకలను అమ్రాబాద్ మండలం, మాచారం గ్రామంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జలంధర్ రెడ్డిని భారీ గజమాలతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు, బోల్గేట్‌పల్లి గ్రామ సమీపంలోని లేనిటీ ఫౌండేషన్‌ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు. సమాజ సేవే నిజమైన పుట్టినరోజు వేడుకల ఉద్దేశమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరే రేణయ్య, రాంచందర్, దొడ్ల అంజి యాదవ్, జగన్, ఖాసీం, రామాంజనేయులు, వెంకటేష్, పర్వతాలు, శ్రీను తదితర గ్రామస్తులు పాల్గొని జలంధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.