పాత మద్దిపడిగ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆదేశాల మేరకు కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో పాత మద్దిపడిగ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా కాళ్ల శేఖర్, ఉపాధ్యక్షులుగా యాటా దిలీప్, మాదాసు నాగన్న, ప్రధాన కార్యదర్శిగా రాకెం రాజేశ్వర్, కార్యదర్శులుగా దసండ్ల రాకేష్, భోజనాపు శేఖర్, కోశాధికారిగా దొంతమేళ్ల మోహన్ ఎన్నికయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పల్లె రాంరెడ్డి, తడకపల్లి శ్రీనివాస్, గుమ్మడి అజయ్ కుమార్, దుర్గం వెంకటేష్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలకు చేరువై పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమిష్టి కృషితో గ్రామంలో పార్టీని మరింత పటిష్ఠం చేయాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కడెం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముడికె మల్లేశ్ యాదవ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సలీం, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, మండల నాయకుడు దూల్లే వెంకటేష్, గ్రామ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.