ఏఐ వాయిస్ కాలింగ్ స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండాలి: పస్రా ఎస్సై తాజుద్దీన్
గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : ప్రజలు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాయిస్ కాలింగ్ స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పస్రా ఎస్సై తాజుద్దీన్ సూచించారు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు ఏఐ సాంకేతికతను ఉపయోగించి సన్నిహితులు, బంధువులు లేదా స్నేహితుల గొంతును అనుకరిస్తూ అత్యవసర పరిస్థితి పేరుతో డబ్బులు పంపించాలని కోరుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే నమ్మి డబ్బులు పంపవద్దని, ముందుగా సంబంధిత వ్యక్తి అసలు ఫోన్ నంబర్‌కు కాల్ చేసి నిజానిజాలు నిర్ధారించుకోవాలని సూచించారు.
అనుమానాస్పద కాల్స్ లేదా మోసపూరిత ఘటనలు ఎదురైన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్‌ను కూడా సంప్రదించాలని ఎస్సై తాజుద్దీన్ కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి సైబర్ మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.
