నూతన వంతెన ప్రారంభించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్

కృత్తివెన్ను, ఆంధ్రప్రభ: కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామ శివారు గాంధీనగర్‌లో పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్‌షిప్ (పీ4) కార్యక్రమంలో భాగంగా నిర్మించిన నూతన వంతెనను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ వంతెన నిర్మాణం పూర్తికాగా, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న పీ4 కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.