‘ Lenin ‘ ఇప్పుడు మీదే.. రిలీజ్‌కు ముందు అఖిల్ భావోద్వేగ సందేశం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విడుదలకు ముందు ఆయన అభిమానులకు, ప్రేక్షకులకు భావోద్వేగ సందేశం ఇచ్చారు. సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేశారు.

సుదీర్ఘ ప్రయాణం ముగింపు దశకు చేరుకుందని పేర్కొన్న అఖిల్, ‘లెనిన్’ చిత్రాన్ని ఆవిష్కరించేందుకు తన బృందం హృదయపూర్వకంగా శ్రమించిందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమా ప్రచార కంటెంట్‌ను ఆదరించి, విడుదల వరకు ప్రోత్సహించిన మీడియాకు, ప్రేక్షకులకు, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు అఖిల్ కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రేమ, మద్దతు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు.

“ఇక మా చేతుల్లో ఏమీ లేదు. మా ‘లెనిన్’ ఇప్పుడు మీది. ఈ సినిమాను మీరు హృదయపూర్వకంగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. థియేటర్లలో కలుద్దాం” అంటూ అఖిల్ తన సందేశాన్ని ముగించారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విడుదలకు ముందు అఖిల్ చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.