దుర్గమ్మ వేద పాఠశాలలో ప్రవేశాల సందడి
విద్యార్థుల ప్రతిభా పరీక్షలు పూర్తి..
వేదవిద్యాభివృద్ధికి మరింత ప్రోత్సాహం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ శివారులోని పోరంకిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మార్త వేద పాఠశాలలో నూతన విద్యాసంవత్సర ప్రవేశాల ప్రక్రియ సందడిగా సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకాగా, అందిన దరఖాస్తులను ఆలయ అధికారులు, వేద పండితులు పరిశీలించి అర్హులైన విద్యార్థులకు ప్రతిభా, ఉచ్చారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ, సనాతన ధర్మ పరిరక్షణతో పాటు వేదవిద్య అభ్యున్నతికి దేవస్థానం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన వేద విద్యతో పాటు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు అవసరమైన అన్ని వసతులు, ప్రోత్సాహకాలు మరింత విస్తరిస్తామని తెలిపారు. ప్రవేశాల ప్రక్రియను దేవస్థాన అధికారులు, వేద పాఠశాల అధ్యాపకులు, వేద పండితులు పర్యవేక్షించారు.
